Showing posts with label జ్యోతిష్యం. Show all posts
Showing posts with label జ్యోతిష్యం. Show all posts

Saturday, February 15, 2014

మిని జ్యోతిష్య భోధిని :6

నమస్తే బెదరు !
వేల మంది కొరకు వ్రాయాలా? లేక వేళ్ళ మీద  లెక్క పెట్టేసేంత వారికోసం వ్రాయాలా ?అంటే ..కాసింత బుర్ర ఉన్నవాడు సైతం వేల మంది కొరకే వ్రాస్తాడు.

కాని నేను బుర్రతో పాటు మనస్సు కూడ కలిగి ఉన్న వ్యక్తిని. మీలో ఎవరో ఒకరు ఏదో సమస్య పరిష్కారం కోసం అలమటిస్తున్నారు. ఆ పరిష్కారం ఏదో నా ఈ సీరియలుతోనే లభ్యం అని దేవుడు వ్రాసి ఉండొచ్చు. అందుకేనేమో ..ఎంత పని వత్తిడి ఉన్నా ఈ టపా పోస్టు చెయ్యక ఉండలేక పోతున్నా.

అయితే మరీ వారాలు తరబడి ఇలా తక్కువ మంది కొరకు వ్రాయాలంటే కష్థమే మరి.కాబట్టి నా టపాలను ఫేస్ బుక్ వంటి సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్లో తప్పక షేర్ చెయ్యండి. ఇక పాయింటుకొస్తా.


సాంప్రదాయక గ్రహ పరిహారాలు:
                            
నవ గ్రహాలిచ్చే అశుభ పలితాలను తగ్గించడానికి రుషులు సూచించిన మార్గాలనే పరిహారాలు అంటారు. ప్రతి ఒక్క గ్రహానికి ఒక వృక్షం, లొహం, రంగు, కులం,రత్నం ఉంటాయి.

ఓ గ్రహం అశుభఫల ధాయకంగా ఉంటే ఆ గ్రహానికి సంభందించిన దేవతను పూజించాలి.
సతరు గ్రహ సంభంధ చెట్టుకు  నీళ్ళు పొయ్యలి.(పూజ చేయ్యడం కాదు). అక్కడ కాసేపుండి
ఆ గాలిని అస్వాదించాలి,

సతరు గ్రహ సంభంధ లొహాన్ని దానం చేయ్యలి. సతరు రంగు భట్టలు, వస్తువులు ఎక్కువగా వాడాలి. సతరు కులంవారికి అన్నం పెట్టలి. సతరు రత్నం దరించాలి ఇదే  సాంప్రదాయిక పరిహారం.

మారి పోయిన జీవన విధానం,పెరిగి పోతున్న ఆశలు ఇలా ఎన్నో కారణాలచేత పై తెలిపిన సాంప్రదాయిక పరిహారాలు కావల్సినంత ఉపసమనం లభ్యం కావడం లేదు. అందుకే నా సుధీర్ఘ అనుభవంతో కొన్ని హేతు బద్ద పరిహారాలను సూచించడం మొదలు పెట్టాను. 

వాటిని -వాటికి ఉన్న హేతుబద్దతను తదుపరి తపాలో చెబుతాను. అంతకు పూర్వం ఏ గ్రహానికి ఏ ఏ విషయాలు సంభంధం కలిగి ఉంటాయన్న విషయాలను చెప్పాలిగా?

వాటిని కూడ ఖచ్చితంగా వివరిస్తా. వెయిట్ ప్లీజ్ !

(శశేషం)

Saturday, February 8, 2014

మిని జ్యోతిష్య బోధిని: 5

నమస్తే బెదరు !
గతంలో నేను శ్రీ కృష్ణ జ్వెలర్సు ఆద్వర్యంలో  ముద్రించి  చిత్తూరు పట్టణ ప్రజలకు ఉచితంగా పంచి ఎట్టిన మిని జ్యోతిష్య బోధిని అనే చిన్ని పుస్తకాన్నే మిన్ సీర్యల్గా అందిస్తున్నా.

ఒక పక్క కుమార్తె వివాహం,మరో పక్క పుస్తకాల ముద్రణ (తమిళంలో ఏక కాలంలో నాలుగు పుస్తకాలు మరి) మరో ప్రక్క నా వద్ద ఉన్న డొక్కు బజాజ్ సన్ని బైక్లను అనుసంథించి మొబైల్ బుక్ స్టోరుగా మలచే యత్నం . ఇన్ని ఫ్టింగులు ఒక్క సారిగా తగులు కోవడంతో ఈ సీరియల్ కాస్త కుంటు బడింది.

ఇంతకీ దీనిని టైప్ చేసింది నేను కాదు. తిండికి టికానా లేని ,తల నిండా అహంకారం నిండిన ఒక యెదవన్నర యెదవ.పస్తుండి చస్తాడేమోమోనన్న గిల్టితో అతనికి ఇంత కూడు పెట్టాలన్న సతుద్దేశంతో వీటిని టైప్ చెయ్యించా. నేర్పింది కూడ నేనే.

అతని జీవితంలో వళ్ళు వంచి ఒక నేర్చుకుని చేసింది ఇదొక్కటే. అయితే తనేదో పెద్ద మేథావి అన్న ఫీలుంగు తనకి .అన్ని తప్పులు తడకులు. వీటినన్నా క్షమించొచ్చు కాని నా రచనలను కలుషితం చేసే ప్రయత్నం మరొక్కటి.

నాకు మైండునుండి కొట్టడం వచ్చు కాని చూసి కొట్టడం రాదు.ఏది ఏమైనప్పటికి మళ్ళీ వచ్చా. నా వ్రాతలు చదవాలంటే ఈ రోతలు భరించాలి మరి .

రోత చాలు కాని  పాయింటుకొస్తా..


కుజ,సర్ప దోషాలు:
                   
కుజగ్రహం జన్మ లగ్నం నుండి 3,6,10,11,స్థానాలు కాక మరే స్థానంలొ ఉన్నా అది కుజదోషం.

రాహు కేతువులు 3,6,10,11,4,12.తప్పించి మరే స్థానంలొ ఉన్నా అది సర్పదొషం.

దొషాలున్న వారు లేని వార్ని చేసుకుంటే చస్తారన్నది. అతిశొయుక్తి మరణాన్ని నిర్ణయిమ్చేది వారి వారి జాతకాలే. కేవలం జీవిత భాగస్వామి జాతకంలొని దోషం మాత్రమే మరణాన్నిస్తుందంటే అది కేవలం మూఢవిశ్వాసమే అవుతుంది.

1. మీ శారీరక ధారఢ్యతను పట్టి -మీ కుటుంభ డాక్టరును సంప్రదించి  రక్తదానం చేయండి కుజదోషం పరిహారం అవుతుంది.
2. సర్పదోష పరిహారం; విదేశీ భాష ఒక దానిని నేర్చుకొండి ఉ" జేర్మన్, ఫ్రేంచ్

దోషాలున్నవారు, దొషాలున్న వారినే వివాహం చేసుకోవడం వలన దోషాలు పోవు.
ఒకే గూటికి చేందిన పక్షుల్లా ఒకరి నొకరు తేలిగ్గా అర్థం చేసుకోగలరు. శుద్ద జాతకులు అనవసరంగా తమకు లేని ఇబ్బందులను కొని తేచ్చుకొక రక్షింపపడ్తరనే పేద్దలు ఈ ఏర్పటును చేసియున్నారు.
­­­­­­­­­­­­­­­­­­­­                                                              
వివాహ పొంతనలు
               
వివాహ పొంతనాలను 3 విదాలుగా చూస్తారు.
1. వధు, వరుల జాతకాలను పట్టి.2. వారి జన్మ నక్షత్రాలను పట్టి.3. వారి పేర్లను పట్టి.
                                                             
వీటిలొ మొదటిది హేదుబద్దం, వధువరుల జాతకాలను పరీశీలించినప్పుడు గురు, శుక్ర స్థితి ముఖ్యం అలాగే దోషాలు ఉంటే ఇరువురికి ఉండాలి.(అన్నది పెద్దల నిర్ణయం).

రేండవది 35% హేతుబద్దం సాధారణంగా 10 పొంతనాలు చూస్తారు. వీటిలొ రజ్జు నాడికీలకం (అరవ దేశంలో నాడికి బదులుగా వేదై పొంతనం చూస్తారు),
వదు,వరుల జాతకాల నడుమ పొత్తు కుదిరి , జాతకాలు కలిసి ఉంటే కేవలం  రజ్జు, నాడి బాగున్నా శుభంగా వివాహం చేయవచ్చును( అన్నది నా అభిప్రాయం).
రజ్జు+ నాడితొ కలిపి 6 పొంతనాలు ఉండాలి (అన్నది శాస్త్ర్రం).

మూడవది పేర్లను పట్టి చూడటం. ఆ పేర్లు వారి జన్మ నక్షత్రాల కనుగుణంగా పేట్టబడి ఉంటే 35%
హేతుబద్దమే. అలాకాక ఉత్తుత్తి పేర్లకు ముద్దు పేర్లకు, అక్షణం నిర్ణయించుకున్న పేర్లుకు పొంతనాలు
చూడడం అహెతుకం, అశాస్త్ర్రీయం.

________(శశేషం)________

Wednesday, January 29, 2014

మిని జ్యీతిష్య బోధిని : 3 (మిని సీరియల్)



నమస్తే బెదరు !
ఇటీవల ప్రారంభించిన ఈ బ్లాగులో మి.జో.బో పేరిట ఒక మిని సీరియల్ మొదలు పెట్టాను. అందులోని గత టపాలో లగ్నాధిపతిని అటు కోణాధిపతిగాను - కేంద్రాధిపతిగాను పేర్కొనడం జరిగింది (టూ ఇన్ వన్) . అలానే కేంద్రాహిపతి ఏమో పాపి,కోణాధిపతి ఏమో శుభుడు అని  కూడ వివరించడం జరిగింది.

మీలో కొందరు కాస్త తిక మక పడి ఉంటారు. ఇంతకీ లగ్నాధిపతి శుభుడా? పాపియా?

అందుకే మొదట ఈ చిన్న వివరణ. లగ్నాధిపతి అంటే ఎవరు? మీరే బెదరు. మీకు జరిగే  మంచికి  గాని చెడ్డకు గాని ఎవరు కారకులు?  మీరే కదా?

అందుకే లగ్నాధిపతి టూ ఇన్ వన్ అయ్యాడు. ఇక టపాలోకి వెళ్ళి పోదామా?


భావాధిపతుల్లో ఎవరు ఎక్కడ ఉంటే మేలు:
1,5,9లొ శుభులు ఉత్తమం, పావులు మద్యమం.
4.7,10. పావులు ఉత్తమం శుభులు మద్యమం.6,8,12. లొ గ్రహాలు లేకుంటే ఉత్తమం. లేదా ఈ స్థానాధిపతులే ఈ స్థానాల్లో ఉంటే మేలు. అయితే అది వారికి స్వక్షేత్రం అయ్యుండరాదు.

శుభత్వ పాపత్వ నిర్ణయం:
జ్యోతిష్య శాస్త్రంలో నైసర్గిక/లగ్నత్ శొభత్వ పాపత్వములంటూ రేండున్నప్పటికి అనుభవంలో చూసినప్పుడు లగ్నాత్ శుభ,పాపత్వనిర్ణయమే మరింత హేతు బద్దంగా ఉంది.

ఒకే గ్రహానికి శుభత్వం పాపత్వం;
ఒకే గ్రహనికి శుభత్వ- పాపత్వం కలుగుతుంటుంది. ఉదాహరణ: లగ్నం మిధునం అనుకొండి! శని 8,9 రెండు భావాలకు అధిపతి అవుతున్నాడు.

ఇలాంటి పరిస్థితిలో (ఒకే గ్రహనికి శుభత్వం+ పాపత్వం కలిగినప్పుడు)

అ గ్రహం మొదట పాపిగాను అ తరువాత శుభుడుగాను ఫలితానిస్తాడు. సతరు గ్రహం యెక్కదశ జరిగినప్పుడు అదశలొ ప్రథమ బాగం దుష్పలితాలను తదుపరి భాగం శుభపలితాలను ఇస్తుంది. అలానే జీవిత కాలంలోను ఒక భాగంలో  పాజిటివ్గా ఒక భాగంలో నెగటివ్గా ఫలితాన్నిస్తుంది.
ఉదాహరణకు మిథున లగ్నానికి శని అటు అష్ఠమాధిపతిగాను –భాగ్యాధిపతిగాను ఉంటాడు.


గ్రహబలం;
గ్రహాలు తాము ఉచ్చబలం పొందే రాశికి ఏడవ ఇంట నీచం పొందుతారు. ఏ గ్రహం ఏ రాశిలో ఉచ్చం అవ్వగలదో క్రింది  పట్టికలొ చూడగలరు.
రవి-మేషం, చం-వృషభం, కుజ-మకరం,బుధ-కన్య గురు-కర్కాటకం, శుక్ర-మీనం ,శని-తుల.

జాతకంలోని గ్రహాల భలాన్ని నిర్ణయించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటిని రేపు వివరిస్తాను

(శశేషం)

Monday, January 27, 2014

మైనస్ 30 వయస్కులకు మాత్రమే

అనుభవ జ్యోతిష్యం పేరిట బ్లాగ్ ప్రారంభించానని చెప్పగానే ఈ బ్లాగును బుక్ మార్క్ చేసుకుని మరి విచ్చేసిన మీకు అన్ని శుభాలు కలుగనున్నాయి. కనీశం అశుభాలు తగ్గి పోనున్నాయి. ఇది మీకు నేను ఉత్తుత్తే ఇచ్చే తాయిలం కాదు సుమండి. అక్షరాల నిజం.

జ్యోతిష్యం మీద అస్సల్ నమ్మకం లేని వారు -నమ్మకం ఉన్నా ఏమాత్రం అవగాహణ లేని వారు -అవగాహణ కారణంగానే జ్యోతిష్కుల మీద నమ్మకం కోల్పోయిన వారు ఇలా అందరికీ ఎంతో కొంత మేలు చేకూరే విదంగా ఈ బ్లాగులో పోస్టులు వ్రాయాలనుకున్నా.

నా వయస్సు 46 కావడంతో - యువతను సైతం ఆకట్టుకోవాలనే కకృత్తి కొంత  ఎక్కువే కనబడుతుంటుంది. నన్నడిగితే ముప్పై ఏళ్ళకు పై పడ్డ వారు జాతకం చూపించుకోవడమే తప్పు. ఎందుకంటే ఒక వేళ వారు తమ జాతకానికి ఏమాత్రం సంభంధం లేని రంగంలో చిక్కుకు పోయి అష్ఠ కష్ఠాలు పడుతున్నా అందులోనుండి అంత తేలిగ్గా భయిట పడలేరు.

ఇదే యువకులైతే ప్రారంభంలోనే తమ రంగం ఏదో ముందుగా తెలుసుకొని అందుకు సంభంధించిన విధ్యను ఆర్జించి, విద్యకు సంభందించిన ఉధ్యోగం చూసుకొని ఏం చక్కా బతికెయ్యగలరు.

కోటి విద్యలు కూటు కోసమే ఎన్నాడెవడో ఒక వెధవ. అది అచ్చు తప్పు .కోటి విథ్యలు జన కోటి కోసమే.  చిల్లి గవ్వకు గతి లేక తిండికి టికానా లేక బతుకు బండి లాగిస్తున్న రోజుల్లో "మిని జ్యోతిష్య భోధిని" పేరిట ఒక చిన్నపుస్తకం వ్రాసి ప్రచురించాను.

చిత్తూరు పట్టణ వ్యాపారస్తుల సౌజణ్యంతో అది విడుదలైంది. దానిని చూసిన చిత్తూరు శ్రీ కృష్ణ జ్వెలర్స్ అధినేత జితేంద్ర బాబు జైన్ తమ స్పాన్సర్ షిప్లో ఐదువేల ప్రతులు ముద్రించి దినపత్రికల్లో పెట్టి మరి జన బాహుళ్యానికి అందుభాటులో తెచ్చారు.

ఈ నిష్కామ్య ఖర్మం మరి నా ప్రాక్టీస్ మెరుగు పడటానికి కూడ దోహదపడటం ఇప్పటికీ మరువలేను.  సతరు మిని జ్యోతిష్య భోధినిలోని విషయాలను మీకు ఒక మిని సీరియల్గా అందివ్వాలని దలచాను.

అయితే  నా కండిషన్ ఒకటే ఈ బ్లాగు చదివే ప్రతి ఒక్కరు దీనిని తమ మిత్ర భృందాలకు పరిచయం చెయ్యాలి. పాఠకుల సంఖ్య రోజుకి కనీశం వందైనా పెరగాలి.లేకుంటే వ్రాయడం మానేస్తా.