Saturday, February 15, 2014

మిని జ్యోతిష్య భోధిని :6

నమస్తే బెదరు !
వేల మంది కొరకు వ్రాయాలా? లేక వేళ్ళ మీద  లెక్క పెట్టేసేంత వారికోసం వ్రాయాలా ?అంటే ..కాసింత బుర్ర ఉన్నవాడు సైతం వేల మంది కొరకే వ్రాస్తాడు.

కాని నేను బుర్రతో పాటు మనస్సు కూడ కలిగి ఉన్న వ్యక్తిని. మీలో ఎవరో ఒకరు ఏదో సమస్య పరిష్కారం కోసం అలమటిస్తున్నారు. ఆ పరిష్కారం ఏదో నా ఈ సీరియలుతోనే లభ్యం అని దేవుడు వ్రాసి ఉండొచ్చు. అందుకేనేమో ..ఎంత పని వత్తిడి ఉన్నా ఈ టపా పోస్టు చెయ్యక ఉండలేక పోతున్నా.

అయితే మరీ వారాలు తరబడి ఇలా తక్కువ మంది కొరకు వ్రాయాలంటే కష్థమే మరి.కాబట్టి నా టపాలను ఫేస్ బుక్ వంటి సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్లో తప్పక షేర్ చెయ్యండి. ఇక పాయింటుకొస్తా.


సాంప్రదాయక గ్రహ పరిహారాలు:
                            
నవ గ్రహాలిచ్చే అశుభ పలితాలను తగ్గించడానికి రుషులు సూచించిన మార్గాలనే పరిహారాలు అంటారు. ప్రతి ఒక్క గ్రహానికి ఒక వృక్షం, లొహం, రంగు, కులం,రత్నం ఉంటాయి.

ఓ గ్రహం అశుభఫల ధాయకంగా ఉంటే ఆ గ్రహానికి సంభందించిన దేవతను పూజించాలి.
సతరు గ్రహ సంభంధ చెట్టుకు  నీళ్ళు పొయ్యలి.(పూజ చేయ్యడం కాదు). అక్కడ కాసేపుండి
ఆ గాలిని అస్వాదించాలి,

సతరు గ్రహ సంభంధ లొహాన్ని దానం చేయ్యలి. సతరు రంగు భట్టలు, వస్తువులు ఎక్కువగా వాడాలి. సతరు కులంవారికి అన్నం పెట్టలి. సతరు రత్నం దరించాలి ఇదే  సాంప్రదాయిక పరిహారం.

మారి పోయిన జీవన విధానం,పెరిగి పోతున్న ఆశలు ఇలా ఎన్నో కారణాలచేత పై తెలిపిన సాంప్రదాయిక పరిహారాలు కావల్సినంత ఉపసమనం లభ్యం కావడం లేదు. అందుకే నా సుధీర్ఘ అనుభవంతో కొన్ని హేతు బద్ద పరిహారాలను సూచించడం మొదలు పెట్టాను. 

వాటిని -వాటికి ఉన్న హేతుబద్దతను తదుపరి తపాలో చెబుతాను. అంతకు పూర్వం ఏ గ్రహానికి ఏ ఏ విషయాలు సంభంధం కలిగి ఉంటాయన్న విషయాలను చెప్పాలిగా?

వాటిని కూడ ఖచ్చితంగా వివరిస్తా. వెయిట్ ప్లీజ్ !

(శశేషం)

No comments:

Post a Comment