Saturday, February 8, 2014

మిని జ్యోతిష్య బోధిని: 5

నమస్తే బెదరు !
గతంలో నేను శ్రీ కృష్ణ జ్వెలర్సు ఆద్వర్యంలో  ముద్రించి  చిత్తూరు పట్టణ ప్రజలకు ఉచితంగా పంచి ఎట్టిన మిని జ్యోతిష్య బోధిని అనే చిన్ని పుస్తకాన్నే మిన్ సీర్యల్గా అందిస్తున్నా.

ఒక పక్క కుమార్తె వివాహం,మరో పక్క పుస్తకాల ముద్రణ (తమిళంలో ఏక కాలంలో నాలుగు పుస్తకాలు మరి) మరో ప్రక్క నా వద్ద ఉన్న డొక్కు బజాజ్ సన్ని బైక్లను అనుసంథించి మొబైల్ బుక్ స్టోరుగా మలచే యత్నం . ఇన్ని ఫ్టింగులు ఒక్క సారిగా తగులు కోవడంతో ఈ సీరియల్ కాస్త కుంటు బడింది.

ఇంతకీ దీనిని టైప్ చేసింది నేను కాదు. తిండికి టికానా లేని ,తల నిండా అహంకారం నిండిన ఒక యెదవన్నర యెదవ.పస్తుండి చస్తాడేమోమోనన్న గిల్టితో అతనికి ఇంత కూడు పెట్టాలన్న సతుద్దేశంతో వీటిని టైప్ చెయ్యించా. నేర్పింది కూడ నేనే.

అతని జీవితంలో వళ్ళు వంచి ఒక నేర్చుకుని చేసింది ఇదొక్కటే. అయితే తనేదో పెద్ద మేథావి అన్న ఫీలుంగు తనకి .అన్ని తప్పులు తడకులు. వీటినన్నా క్షమించొచ్చు కాని నా రచనలను కలుషితం చేసే ప్రయత్నం మరొక్కటి.

నాకు మైండునుండి కొట్టడం వచ్చు కాని చూసి కొట్టడం రాదు.ఏది ఏమైనప్పటికి మళ్ళీ వచ్చా. నా వ్రాతలు చదవాలంటే ఈ రోతలు భరించాలి మరి .

రోత చాలు కాని  పాయింటుకొస్తా..


కుజ,సర్ప దోషాలు:
                   
కుజగ్రహం జన్మ లగ్నం నుండి 3,6,10,11,స్థానాలు కాక మరే స్థానంలొ ఉన్నా అది కుజదోషం.

రాహు కేతువులు 3,6,10,11,4,12.తప్పించి మరే స్థానంలొ ఉన్నా అది సర్పదొషం.

దొషాలున్న వారు లేని వార్ని చేసుకుంటే చస్తారన్నది. అతిశొయుక్తి మరణాన్ని నిర్ణయిమ్చేది వారి వారి జాతకాలే. కేవలం జీవిత భాగస్వామి జాతకంలొని దోషం మాత్రమే మరణాన్నిస్తుందంటే అది కేవలం మూఢవిశ్వాసమే అవుతుంది.

1. మీ శారీరక ధారఢ్యతను పట్టి -మీ కుటుంభ డాక్టరును సంప్రదించి  రక్తదానం చేయండి కుజదోషం పరిహారం అవుతుంది.
2. సర్పదోష పరిహారం; విదేశీ భాష ఒక దానిని నేర్చుకొండి ఉ" జేర్మన్, ఫ్రేంచ్

దోషాలున్నవారు, దొషాలున్న వారినే వివాహం చేసుకోవడం వలన దోషాలు పోవు.
ఒకే గూటికి చేందిన పక్షుల్లా ఒకరి నొకరు తేలిగ్గా అర్థం చేసుకోగలరు. శుద్ద జాతకులు అనవసరంగా తమకు లేని ఇబ్బందులను కొని తేచ్చుకొక రక్షింపపడ్తరనే పేద్దలు ఈ ఏర్పటును చేసియున్నారు.
­­­­­­­­­­­­­­­­­­­­                                                              
వివాహ పొంతనలు
               
వివాహ పొంతనాలను 3 విదాలుగా చూస్తారు.
1. వధు, వరుల జాతకాలను పట్టి.2. వారి జన్మ నక్షత్రాలను పట్టి.3. వారి పేర్లను పట్టి.
                                                             
వీటిలొ మొదటిది హేదుబద్దం, వధువరుల జాతకాలను పరీశీలించినప్పుడు గురు, శుక్ర స్థితి ముఖ్యం అలాగే దోషాలు ఉంటే ఇరువురికి ఉండాలి.(అన్నది పెద్దల నిర్ణయం).

రేండవది 35% హేతుబద్దం సాధారణంగా 10 పొంతనాలు చూస్తారు. వీటిలొ రజ్జు నాడికీలకం (అరవ దేశంలో నాడికి బదులుగా వేదై పొంతనం చూస్తారు),
వదు,వరుల జాతకాల నడుమ పొత్తు కుదిరి , జాతకాలు కలిసి ఉంటే కేవలం  రజ్జు, నాడి బాగున్నా శుభంగా వివాహం చేయవచ్చును( అన్నది నా అభిప్రాయం).
రజ్జు+ నాడితొ కలిపి 6 పొంతనాలు ఉండాలి (అన్నది శాస్త్ర్రం).

మూడవది పేర్లను పట్టి చూడటం. ఆ పేర్లు వారి జన్మ నక్షత్రాల కనుగుణంగా పేట్టబడి ఉంటే 35%
హేతుబద్దమే. అలాకాక ఉత్తుత్తి పేర్లకు ముద్దు పేర్లకు, అక్షణం నిర్ణయించుకున్న పేర్లుకు పొంతనాలు
చూడడం అహెతుకం, అశాస్త్ర్రీయం.

________(శశేషం)________

No comments:

Post a Comment