నమస్తే బెదరు !
ఇటీవల ప్రారంభించిన ఈ బ్లాగులో మి.జో.బో పేరిట ఒక మిని సీరియల్ మొదలు పెట్టాను. అందులోని గత టపాలో లగ్నాధిపతిని అటు కోణాధిపతిగాను - కేంద్రాధిపతిగాను పేర్కొనడం జరిగింది (టూ ఇన్ వన్) . అలానే కేంద్రాహిపతి ఏమో పాపి,కోణాధిపతి ఏమో శుభుడు అని కూడ వివరించడం జరిగింది.
మీలో కొందరు కాస్త తిక మక పడి ఉంటారు. ఇంతకీ లగ్నాధిపతి శుభుడా? పాపియా?
అందుకే మొదట ఈ చిన్న వివరణ. లగ్నాధిపతి అంటే ఎవరు? మీరే బెదరు. మీకు జరిగే మంచికి గాని చెడ్డకు గాని ఎవరు కారకులు? మీరే కదా?
అందుకే లగ్నాధిపతి టూ ఇన్ వన్ అయ్యాడు. ఇక టపాలోకి వెళ్ళి పోదామా?
భావాధిపతుల్లో ఎవరు ఎక్కడ ఉంటే మేలు:
1,5,9లొ శుభులు ఉత్తమం, పావులు మద్యమం.
4.7,10. పావులు ఉత్తమం శుభులు మద్యమం.6,8,12.
లొ గ్రహాలు లేకుంటే ఉత్తమం. లేదా ఈ స్థానాధిపతులే ఈ
స్థానాల్లో ఉంటే మేలు. అయితే అది వారికి స్వక్షేత్రం అయ్యుండరాదు.
శుభత్వ పాపత్వ నిర్ణయం:
జ్యోతిష్య శాస్త్రంలో నైసర్గిక/లగ్నత్ శొభత్వ పాపత్వములంటూ రేండున్నప్పటికి అనుభవంలో చూసినప్పుడు లగ్నాత్ శుభ,పాపత్వనిర్ణయమే మరింత హేతు బద్దంగా ఉంది.
ఒకే గ్రహానికి శుభత్వం పాపత్వం;
ఒకే గ్రహనికి శుభత్వ- పాపత్వం కలుగుతుంటుంది. ఉదాహరణ: లగ్నం మిధునం అనుకొండి! శని 8,9 రెండు భావాలకు అధిపతి అవుతున్నాడు.
ఇలాంటి పరిస్థితిలో (ఒకే గ్రహనికి శుభత్వం+ పాపత్వం కలిగినప్పుడు)
అ గ్రహం మొదట పాపిగాను అ తరువాత శుభుడుగాను ఫలితానిస్తాడు. సతరు గ్రహం యెక్కదశ జరిగినప్పుడు అదశలొ ప్రథమ బాగం దుష్పలితాలను తదుపరి భాగం శుభపలితాలను ఇస్తుంది. అలానే
జీవిత కాలంలోను ఒక భాగంలో పాజిటివ్గా ఒక
భాగంలో నెగటివ్గా ఫలితాన్నిస్తుంది.
ఉదాహరణకు మిథున
లగ్నానికి శని అటు అష్ఠమాధిపతిగాను –భాగ్యాధిపతిగాను ఉంటాడు.
గ్రహబలం;
గ్రహాలు తాము ఉచ్చబలం పొందే రాశికి ఏడవ ఇంట నీచం పొందుతారు. ఏ గ్రహం ఏ
రాశిలో ఉచ్చం అవ్వగలదో క్రింది పట్టికలొ చూడగలరు.
రవి-మేషం, చం-వృషభం, కుజ-మకరం,బుధ-కన్య గురు-కర్కాటకం, శుక్ర-మీనం ,శని-తుల.
జాతకంలోని గ్రహాల
భలాన్ని నిర్ణయించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటిని రేపు వివరిస్తాను
No comments:
Post a Comment