Monday, January 27, 2014

మైనస్ 30 వయస్కులకు మాత్రమే

అనుభవ జ్యోతిష్యం పేరిట బ్లాగ్ ప్రారంభించానని చెప్పగానే ఈ బ్లాగును బుక్ మార్క్ చేసుకుని మరి విచ్చేసిన మీకు అన్ని శుభాలు కలుగనున్నాయి. కనీశం అశుభాలు తగ్గి పోనున్నాయి. ఇది మీకు నేను ఉత్తుత్తే ఇచ్చే తాయిలం కాదు సుమండి. అక్షరాల నిజం.

జ్యోతిష్యం మీద అస్సల్ నమ్మకం లేని వారు -నమ్మకం ఉన్నా ఏమాత్రం అవగాహణ లేని వారు -అవగాహణ కారణంగానే జ్యోతిష్కుల మీద నమ్మకం కోల్పోయిన వారు ఇలా అందరికీ ఎంతో కొంత మేలు చేకూరే విదంగా ఈ బ్లాగులో పోస్టులు వ్రాయాలనుకున్నా.

నా వయస్సు 46 కావడంతో - యువతను సైతం ఆకట్టుకోవాలనే కకృత్తి కొంత  ఎక్కువే కనబడుతుంటుంది. నన్నడిగితే ముప్పై ఏళ్ళకు పై పడ్డ వారు జాతకం చూపించుకోవడమే తప్పు. ఎందుకంటే ఒక వేళ వారు తమ జాతకానికి ఏమాత్రం సంభంధం లేని రంగంలో చిక్కుకు పోయి అష్ఠ కష్ఠాలు పడుతున్నా అందులోనుండి అంత తేలిగ్గా భయిట పడలేరు.

ఇదే యువకులైతే ప్రారంభంలోనే తమ రంగం ఏదో ముందుగా తెలుసుకొని అందుకు సంభంధించిన విధ్యను ఆర్జించి, విద్యకు సంభందించిన ఉధ్యోగం చూసుకొని ఏం చక్కా బతికెయ్యగలరు.

కోటి విద్యలు కూటు కోసమే ఎన్నాడెవడో ఒక వెధవ. అది అచ్చు తప్పు .కోటి విథ్యలు జన కోటి కోసమే.  చిల్లి గవ్వకు గతి లేక తిండికి టికానా లేక బతుకు బండి లాగిస్తున్న రోజుల్లో "మిని జ్యోతిష్య భోధిని" పేరిట ఒక చిన్నపుస్తకం వ్రాసి ప్రచురించాను.

చిత్తూరు పట్టణ వ్యాపారస్తుల సౌజణ్యంతో అది విడుదలైంది. దానిని చూసిన చిత్తూరు శ్రీ కృష్ణ జ్వెలర్స్ అధినేత జితేంద్ర బాబు జైన్ తమ స్పాన్సర్ షిప్లో ఐదువేల ప్రతులు ముద్రించి దినపత్రికల్లో పెట్టి మరి జన బాహుళ్యానికి అందుభాటులో తెచ్చారు.

ఈ నిష్కామ్య ఖర్మం మరి నా ప్రాక్టీస్ మెరుగు పడటానికి కూడ దోహదపడటం ఇప్పటికీ మరువలేను.  సతరు మిని జ్యోతిష్య భోధినిలోని విషయాలను మీకు ఒక మిని సీరియల్గా అందివ్వాలని దలచాను.

అయితే  నా కండిషన్ ఒకటే ఈ బ్లాగు చదివే ప్రతి ఒక్కరు దీనిని తమ మిత్ర భృందాలకు పరిచయం చెయ్యాలి. పాఠకుల సంఖ్య రోజుకి కనీశం వందైనా పెరగాలి.లేకుంటే వ్రాయడం మానేస్తా.

No comments:

Post a Comment