Saturday, February 15, 2014

మిని జ్యోతిష్య భోధిని :6

నమస్తే బెదరు !
వేల మంది కొరకు వ్రాయాలా? లేక వేళ్ళ మీద  లెక్క పెట్టేసేంత వారికోసం వ్రాయాలా ?అంటే ..కాసింత బుర్ర ఉన్నవాడు సైతం వేల మంది కొరకే వ్రాస్తాడు.

కాని నేను బుర్రతో పాటు మనస్సు కూడ కలిగి ఉన్న వ్యక్తిని. మీలో ఎవరో ఒకరు ఏదో సమస్య పరిష్కారం కోసం అలమటిస్తున్నారు. ఆ పరిష్కారం ఏదో నా ఈ సీరియలుతోనే లభ్యం అని దేవుడు వ్రాసి ఉండొచ్చు. అందుకేనేమో ..ఎంత పని వత్తిడి ఉన్నా ఈ టపా పోస్టు చెయ్యక ఉండలేక పోతున్నా.

అయితే మరీ వారాలు తరబడి ఇలా తక్కువ మంది కొరకు వ్రాయాలంటే కష్థమే మరి.కాబట్టి నా టపాలను ఫేస్ బుక్ వంటి సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్లో తప్పక షేర్ చెయ్యండి. ఇక పాయింటుకొస్తా.


సాంప్రదాయక గ్రహ పరిహారాలు:
                            
నవ గ్రహాలిచ్చే అశుభ పలితాలను తగ్గించడానికి రుషులు సూచించిన మార్గాలనే పరిహారాలు అంటారు. ప్రతి ఒక్క గ్రహానికి ఒక వృక్షం, లొహం, రంగు, కులం,రత్నం ఉంటాయి.

ఓ గ్రహం అశుభఫల ధాయకంగా ఉంటే ఆ గ్రహానికి సంభందించిన దేవతను పూజించాలి.
సతరు గ్రహ సంభంధ చెట్టుకు  నీళ్ళు పొయ్యలి.(పూజ చేయ్యడం కాదు). అక్కడ కాసేపుండి
ఆ గాలిని అస్వాదించాలి,

సతరు గ్రహ సంభంధ లొహాన్ని దానం చేయ్యలి. సతరు రంగు భట్టలు, వస్తువులు ఎక్కువగా వాడాలి. సతరు కులంవారికి అన్నం పెట్టలి. సతరు రత్నం దరించాలి ఇదే  సాంప్రదాయిక పరిహారం.

మారి పోయిన జీవన విధానం,పెరిగి పోతున్న ఆశలు ఇలా ఎన్నో కారణాలచేత పై తెలిపిన సాంప్రదాయిక పరిహారాలు కావల్సినంత ఉపసమనం లభ్యం కావడం లేదు. అందుకే నా సుధీర్ఘ అనుభవంతో కొన్ని హేతు బద్ద పరిహారాలను సూచించడం మొదలు పెట్టాను. 

వాటిని -వాటికి ఉన్న హేతుబద్దతను తదుపరి తపాలో చెబుతాను. అంతకు పూర్వం ఏ గ్రహానికి ఏ ఏ విషయాలు సంభంధం కలిగి ఉంటాయన్న విషయాలను చెప్పాలిగా?

వాటిని కూడ ఖచ్చితంగా వివరిస్తా. వెయిట్ ప్లీజ్ !

(శశేషం)

Saturday, February 8, 2014

మిని జ్యోతిష్య బోధిని: 5

నమస్తే బెదరు !
గతంలో నేను శ్రీ కృష్ణ జ్వెలర్సు ఆద్వర్యంలో  ముద్రించి  చిత్తూరు పట్టణ ప్రజలకు ఉచితంగా పంచి ఎట్టిన మిని జ్యోతిష్య బోధిని అనే చిన్ని పుస్తకాన్నే మిన్ సీర్యల్గా అందిస్తున్నా.

ఒక పక్క కుమార్తె వివాహం,మరో పక్క పుస్తకాల ముద్రణ (తమిళంలో ఏక కాలంలో నాలుగు పుస్తకాలు మరి) మరో ప్రక్క నా వద్ద ఉన్న డొక్కు బజాజ్ సన్ని బైక్లను అనుసంథించి మొబైల్ బుక్ స్టోరుగా మలచే యత్నం . ఇన్ని ఫ్టింగులు ఒక్క సారిగా తగులు కోవడంతో ఈ సీరియల్ కాస్త కుంటు బడింది.

ఇంతకీ దీనిని టైప్ చేసింది నేను కాదు. తిండికి టికానా లేని ,తల నిండా అహంకారం నిండిన ఒక యెదవన్నర యెదవ.పస్తుండి చస్తాడేమోమోనన్న గిల్టితో అతనికి ఇంత కూడు పెట్టాలన్న సతుద్దేశంతో వీటిని టైప్ చెయ్యించా. నేర్పింది కూడ నేనే.

అతని జీవితంలో వళ్ళు వంచి ఒక నేర్చుకుని చేసింది ఇదొక్కటే. అయితే తనేదో పెద్ద మేథావి అన్న ఫీలుంగు తనకి .అన్ని తప్పులు తడకులు. వీటినన్నా క్షమించొచ్చు కాని నా రచనలను కలుషితం చేసే ప్రయత్నం మరొక్కటి.

నాకు మైండునుండి కొట్టడం వచ్చు కాని చూసి కొట్టడం రాదు.ఏది ఏమైనప్పటికి మళ్ళీ వచ్చా. నా వ్రాతలు చదవాలంటే ఈ రోతలు భరించాలి మరి .

రోత చాలు కాని  పాయింటుకొస్తా..


కుజ,సర్ప దోషాలు:
                   
కుజగ్రహం జన్మ లగ్నం నుండి 3,6,10,11,స్థానాలు కాక మరే స్థానంలొ ఉన్నా అది కుజదోషం.

రాహు కేతువులు 3,6,10,11,4,12.తప్పించి మరే స్థానంలొ ఉన్నా అది సర్పదొషం.

దొషాలున్న వారు లేని వార్ని చేసుకుంటే చస్తారన్నది. అతిశొయుక్తి మరణాన్ని నిర్ణయిమ్చేది వారి వారి జాతకాలే. కేవలం జీవిత భాగస్వామి జాతకంలొని దోషం మాత్రమే మరణాన్నిస్తుందంటే అది కేవలం మూఢవిశ్వాసమే అవుతుంది.

1. మీ శారీరక ధారఢ్యతను పట్టి -మీ కుటుంభ డాక్టరును సంప్రదించి  రక్తదానం చేయండి కుజదోషం పరిహారం అవుతుంది.
2. సర్పదోష పరిహారం; విదేశీ భాష ఒక దానిని నేర్చుకొండి ఉ" జేర్మన్, ఫ్రేంచ్

దోషాలున్నవారు, దొషాలున్న వారినే వివాహం చేసుకోవడం వలన దోషాలు పోవు.
ఒకే గూటికి చేందిన పక్షుల్లా ఒకరి నొకరు తేలిగ్గా అర్థం చేసుకోగలరు. శుద్ద జాతకులు అనవసరంగా తమకు లేని ఇబ్బందులను కొని తేచ్చుకొక రక్షింపపడ్తరనే పేద్దలు ఈ ఏర్పటును చేసియున్నారు.
­­­­­­­­­­­­­­­­­­­­                                                              
వివాహ పొంతనలు
               
వివాహ పొంతనాలను 3 విదాలుగా చూస్తారు.
1. వధు, వరుల జాతకాలను పట్టి.2. వారి జన్మ నక్షత్రాలను పట్టి.3. వారి పేర్లను పట్టి.
                                                             
వీటిలొ మొదటిది హేదుబద్దం, వధువరుల జాతకాలను పరీశీలించినప్పుడు గురు, శుక్ర స్థితి ముఖ్యం అలాగే దోషాలు ఉంటే ఇరువురికి ఉండాలి.(అన్నది పెద్దల నిర్ణయం).

రేండవది 35% హేతుబద్దం సాధారణంగా 10 పొంతనాలు చూస్తారు. వీటిలొ రజ్జు నాడికీలకం (అరవ దేశంలో నాడికి బదులుగా వేదై పొంతనం చూస్తారు),
వదు,వరుల జాతకాల నడుమ పొత్తు కుదిరి , జాతకాలు కలిసి ఉంటే కేవలం  రజ్జు, నాడి బాగున్నా శుభంగా వివాహం చేయవచ్చును( అన్నది నా అభిప్రాయం).
రజ్జు+ నాడితొ కలిపి 6 పొంతనాలు ఉండాలి (అన్నది శాస్త్ర్రం).

మూడవది పేర్లను పట్టి చూడటం. ఆ పేర్లు వారి జన్మ నక్షత్రాల కనుగుణంగా పేట్టబడి ఉంటే 35%
హేతుబద్దమే. అలాకాక ఉత్తుత్తి పేర్లకు ముద్దు పేర్లకు, అక్షణం నిర్ణయించుకున్న పేర్లుకు పొంతనాలు
చూడడం అహెతుకం, అశాస్త్ర్రీయం.

________(శశేషం)________

Thursday, January 30, 2014

మిని జ్యోతిష్య బోధిని: 4


నమస్తే బెదరు !
జోతిషం అంటే అదేదో మాంత్రికం,చేతబడి,మూడ నమ్మకం అనే భావన పలువురిలో ఉన్నది . మీలో కరడు కట్టిన హేతువాదులు ఉన్నా సరే. ఈ సీరియల్ను కొంత ఓపిక చేసుకుని చదవండి. మీకే తలుస్తుంది.జోతిషం అంటే గణితం అని.
పోనీ సీరియల్లోకి చెళ్ళి పోదాం.
జాతకంలో ఏగ్రహం బలం పొందాలి- ఏగ్రహం బలహీనపడాలి:
1,5,9 అధిపతులు అత్యంత బలం, 4,7,10 అధిపతులు మద్యంతర భలం పొందాలి.
6.8,12. అధిపతులు పూర్తిగా బలహీనపడాలి.

ఏగ్రహం ఏగ్రహంతో కలవాలి.
1,5,9 అధిపతులు పరస్పరం  కలుస్తే 75%మంచిది లేదా 4,7,10 అధిపతులే పరస్పరం  కలుస్తే50% మంచిది.

1,5,9,4,7,10 అధిపతులు పరస్పరం కలుస్తే 40% మంచిది. వీరు  2,11 అధిపతులతో కలుస్తే 35% మంచిది.
అయితే పై చేప్పిన అధిపతులేవ్వరికి 6,8,12అధిపతులు తొ కలయక ఉండరాదు. పైన చేప్పిన నిభందలను మీ జాతక చక్రానికే కాక నేటి గ్రహస్థితికి కూడ అన్వయించి చూడవచ్చును.

ద్వాదశ భావ ఫలాలు:
 జాతక చక్రన్ని 12 గళ్ళుగావిభజించారని ముందే చేప్పుకున్నం. ఈ 12 గళ్ళ మీ జీవితం అనే పొర్టబుల్ టి.వి.లొని 12 చానల్స్ ని చూపిస్తాయి.ఈ భావాలకు  భావాధిపతులకు పై చేప్పిన నిభందనలను అన్వయించి చూడండి అవి ఎంత మేరకు సరిపొతాయో అంతమేరకు క్రింద తెలిపిన 12 భావాలు సూచించే రంగాల్లొ మీకు మంచిరానింపు ఉంటుంది.
ద్వాదశ భావాలు:
           
                
1.లగ్నం: మీ తల,శరీరపు ఛాయ , ఎత్తు,బరువు,అరొగ్యం, గుణ గణాలను తేలుపుతుంది.
                                                        
2.దనభావం: రేవిన్యు ఇన్కమ్, కళ్ళు,కంఠం,మాట, వాగ్దాటి, కుటుంభంతో మీ సంభందాలను సూచిస్తుంది.
                                                         

3.సొదర భావం; మీ ప్రయత్నం, సాహసం, కనిష్థ ,సోదరులు,చిన్నపాటి ప్రయాణాలు, సంగీత అభిరుచి,చెవులు
                                                            
4.మాతృభావం; తల్లి, ఇల్లు,వాహనం,విధ్య,హృ దయం,శీలం
                                              
5.పుత్రభావం; మీ బుద్ది కుశలత, అదృష్టం, ప్రశాంతత, ద్యానం, సంతానాలు,పేరు ప్రఖ్యాతలు
                                                     
6.రొగభావం: శత్న,రోగ, రుణ, బాధలు, మేనమామ, పొత్తికడుపు.
                                                
7.కళత్రం: ప్రేండ్,లవర్,పార్ట్నర్,భార్య, నాభి.
                                             
8.అయుర్భావం; దీర్ఘరొగాలు,జైలుపాలు, ఐ.పివేయడం, భానిసత్వాలు, మర్మంగం.
                                                  
9.పితృభావం: మీ పుజ, తండ్రి, తండ్రి తరపు భంధువులు ,పితురార్ఝితం, విదేశీ యాణం, తీర్థయాత్రలు, గురువు, తొడలు .
                                                             
10.జీవనం: వృత్తి, వ్యాపారం, ఉద్యొగాలు
­­­­­­­­­­­­­­­­­­­­                               
11.లాభం; అక్క,అన్న , వ్యాపారంలొ రానింపు.
                                  
12.వ్యయం; నిద్ర, సేక్స్, ఖర్చు పేట్టేవిదానం.

బెదరు! అన్నట్టు ఒక సమాచారం చెప్పాలి. 2011 లో నా తమిళ సైట్లో “జ్యోతిష్యం 360” శీర్షికన గ్రంథం విడుదల చేస్తానని ప్రకటిస్తే  –419 మంది ముందస్తుగా డబ్బు చెల్లించి తమ కాపి రిజర్వు చేసుకున్నారు.

ఏ4 సైజులో 80 పేజీలతో గ్రంథం విడుదలైంది. వెయ్యి కాపీలు డిస్పోజ్ అయి పోగా మళ్ళీ వెయ్యి ప్రతులు ముద్రించ వలసి వచ్చింది.

ప్రస్తుతం ఔత్సాహికులకే కాక –ప్రొఫేష్నల్సుకు సైతం పనికొచ్చే విదంగా రూపు దిద్దుకున్న సతరు గ్రంథం యొక్క సెకండ్ ఎడిషన్ కూడ ఫిబ్రవరి 7 న విడుదల కానుంది. ఇంతకీ ఇవన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే..

పై తెలిపిన గ్రంథాన్ని తెలుగులో సైతం ముద్రించాలని నిర్ణయించాను. అయితే ఇప్పటికే తమిళంలో నాలుగు పుస్తకాల ముద్రణ, కుమార్తె వివాహం వంటి కమిట్మెంట్స్ ఉండటంతో “చేతిలో డబ్బు”ను పెట్టుబడిగా పెట్టి ముద్రించే స్థితిలో నేను లేను.

నా పై నమ్మకం ఉంచి ఒక్కో ప్రతికి రూ.125 చెల్లించి మీరు రిజర్వు చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీరు సిద్దమేనా?

అయితే నాకు మెయిల్ చెయ్యండి. నేను వివరాలు తెలియ చేస్తాను.
(శశేషం)                                   

Wednesday, January 29, 2014

మిని జ్యీతిష్య బోధిని : 3 (మిని సీరియల్)



నమస్తే బెదరు !
ఇటీవల ప్రారంభించిన బ్లాగులో మి.జో.బో పేరిట ఒక మిని సీరియల్ మొదలు పెట్టాను. అందులోని గత టపాలో లగ్నాధిపతిని అటు కోణాధిపతిగాను - కేంద్రాధిపతిగాను పేర్కొనడం జరిగింది (టూ ఇన్ వన్) . అలానే కేంద్రాహిపతి ఏమో పాపి,కోణాధిపతి ఏమో శుభుడు అని  కూడ వివరించడం జరిగింది.

మీలో కొందరు కాస్త తిక మక పడి ఉంటారు. ఇంతకీ లగ్నాధిపతి శుభుడా? పాపియా?

అందుకే మొదట చిన్న వివరణ. లగ్నాధిపతి అంటే ఎవరు? మీరే బెదరు. మీకు జరిగే  మంచికి  గాని చెడ్డకు గాని ఎవరు కారకులు?  మీరే కదా?

అందుకే లగ్నాధిపతి టూ ఇన్ వన్ అయ్యాడు. ఇక టపాలోకి వెళ్ళి పోదామా?


భావాధిపతుల్లో ఎవరు ఎక్కడ ఉంటే మేలు:
1,5,9లొ శుభులు ఉత్తమం, పావులు మద్యమం.
4.7,10. పావులు ఉత్తమం శుభులు మద్యమం.6,8,12. లొ గ్రహాలు లేకుంటే ఉత్తమం. లేదా స్థానాధిపతులే ఈ స్థానాల్లో ఉంటే మేలు. అయితే అది వారికి స్వక్షేత్రం అయ్యుండరాదు.

శుభత్వ పాపత్వ నిర్ణయం:
జ్యోతిష్య శాస్త్రంలో నైసర్గిక/లగ్నత్ శొభత్వ పాపత్వములంటూ రేండున్నప్పటికి అనుభవంలో చూసినప్పుడు లగ్నాత్ శుభ,పాపత్వనిర్ణయమే మరింత హేతు బద్దంగా ఉంది.

ఒకే గ్రహానికి శుభత్వం పాపత్వం;
ఒకే గ్రహనికి శుభత్వ- పాపత్వం కలుగుతుంటుంది. ఉదాహరణ: లగ్నం మిధునం అనుకొండి! శని 8,9 రెండు భావాలకు అధిపతి అవుతున్నాడు.

ఇలాంటి పరిస్థితిలో (ఒకే గ్రహనికి శుభత్వం+ పాపత్వం కలిగినప్పుడు)

గ్రహం మొదట పాపిగాను తరువాత శుభుడుగాను ఫలితానిస్తాడు. సతరు గ్రహం యెక్కదశ జరిగినప్పుడు అదశలొ ప్రథమ బాగం దుష్పలితాలను తదుపరి భాగం శుభపలితాలను ఇస్తుంది. అలానే జీవిత కాలంలోను ఒక భాగంలో  పాజిటివ్గా ఒక భాగంలో నెగటివ్గా ఫలితాన్నిస్తుంది.
ఉదాహరణకు మిథున లగ్నానికి శని అటు అష్ఠమాధిపతిగాను –భాగ్యాధిపతిగాను ఉంటాడు.


గ్రహబలం;
గ్రహాలు తాము ఉచ్చబలం పొందే రాశికి ఏడవ ఇంట నీచం పొందుతారు. గ్రహం ఏ రాశిలో ఉచ్చం అవ్వగలదో క్రింది  పట్టికలొ చూడగలరు.
రవి-మేషం, చం-వృషభం, కుజ-మకరం,బుధ-కన్య గురు-కర్కాటకం, శుక్ర-మీనం ,శని-తుల.

జాతకంలోని గ్రహాల భలాన్ని నిర్ణయించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటిని రేపు వివరిస్తాను

(శశేషం)

Monday, January 27, 2014

మిని జొతిష్య భోదిని

1.జోతిష్యం నిజంగానే ఒక మహా సముద్రం. కొల్లేరు ప్రాంతంలోని రొయ్యల పేంపకం దార్లవలే దేశంలొని
జ్యోతిష్కులు కొంత విద్యను  నిల్వ ఉంచుకొని అదే జ్యోతిష్యం అని చేప్పుకుంటున్నారు.  (నాతో సహా )
వృత్తిపరమైన జ్యోతిష్కుల పరిస్థితే ఇదంటే  ఒక రచయితగా, కవిగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ స్థాపనకు గత 28 సంవత్సరాలుగా కృషి చేస్తున్న నా పరిస్థితి వేరే చేప్పకర్లేదు.

ఒక టేస్ట్ ట్యుబ్లొ  ఆ సముద్రపు నీటిని ప్రొగు చేసి అందులో తర్కం, మానవత్వం అనే రంగులను కలబొసి చూపుతున్నానని చేప్పుకొవచ్చు.

ఈ ఇంటర్నేట్ యుగంలో జ్యోతిష్యంలొని కీలకాంశాలను సరళీకరించి సామాన్యులు సైతం తేలుసుకునేలా చేయ్యలన్న సతుద్దేశంతో ఈ మిని జ్యొతిష్యభొధినిని రూపొందించడం జరిగింది. ఈ చిన్న ప్రచురణలొని అంశాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ జ్యోతిష్కులై పొతారని చేప్పలేను. అయితే జ్యోతిష్యం పేరుతో మోసపొనీకుండ మిమ్మల్ని ఈ చిన్న ప్రచురణ రక్షిస్తుందని మాత్రం హామీ ఇవ్వగలను.

భవిష్యత్తుకు ప్రమానికం జనన సమయం.గర్బదానం చేయబడిన సమయం(తల్లి, తండ్రుల సంయెగం) శిశువు శిరోదయం జరిగిన సమయం,
బిడ్ద కేవ్వున అరచిన సమయం వీటిలో ఎదో ఒక దానిని తీసుకొని ఆ సమయంలోని గ్రహ స్థితిని పట్టి ఫలితాలు చేబుతారు.

 ప్రస్తుతం బిడ్ద కేవ్వుమని అరచిన సమయాన్ని బట్టి జాతకం జాతక ఫలాలు వ్రాస్తు, చేబుతూ ఉన్నారు.
స్త్ర్రీలకు రుతు జాతకం కీలకమని కొందరంటారు. (వారు పుష్ఫవతులైన సమయంలొని గ్రుహస్థితి).
అయితే ఇది తర్కరహితం. ఆస్త్ర్రీ భూమిపై పడిన క్షణం నుండి అమెకేం జరగాలో అది అమె జాతక చక్రంలొనే ఉంటుందన్నది నా అభిప్రాయం, అనుభవం అయితే ఆ రుతు జాతక ప్రభావం దాదాపుగా
21/2 సంవత్సరాల కాలం అమెపై ఉండే అవకాశాన్ని పూర్తిగా త్రోసి పుచ్చలేం.

జాతక ఫలాలు:
ఇందులో దశాభుక్తుల ఫలం, గోచార ఫలం అంటూ రేండు ఉంటాయి. దశాభుక్తుల ఫలానికి జనన
జాతకంలొని గ్రహస్థితే గీటురాయి. గోచార ఫలితం ప్రస్తుతం ఉన్నగ్రహస్థితిని బట్టి చేప్పపడుతుంది.
 జనన కాల గ్రహస్థితి

ఎప్పుడో నేను పుట్టినప్పుడున్న గ్రహస్థితి జీవితాంతం నన్నెలా ప్రభావిస్తుందని మీరు ప్రశ్నించవచ్చును. కేమేరాలో ఫిలిమ్ ఉంటుంది. కేమరా క్లిక్ మన్నప్పుడు షటర్ తేరుచుకున్నక్షణంలొ ఎదురుగా ఉన్న దృశ్యం ఆ  ఫిలిమ్ లొ చిత్రికరించబడుతుంది.
ఒక్కసారి ఈ ప్రక్రియ జరిగిపొయిన తరువాత ఆ  చిత్రంలొ మార్పు చేయడం అసంభవం.
ఇటువంటిదే మీ జనన కాల గ్రహస్థితి మీ పై చూపే ప్రభావం

తత్కాల గ్రహస్థితి :
కంప్యూటర్లు లేనప్పుడు బ్లాక్& వైట్ ఫొటొలకి(ముఖ్యంగా చనిపోయినవారి)రంగుల వేయించుకునే వారు. తత్కాల గ్రహస్థితి కూడ అంతంత ప్రభావాన్నే మనిషి పై చూపుతుంది.
1.జన్మనక్షత్రం:
క్యాలండర్లొ ప్రతిరోజు తేదితో పాటు వారం కూడ మారుతుంటుంది. ఇది అందరికి తేలిసిందే. అయితే నక్షత్రాలు కూడ మారుతుంటాయి.  మీరు పుట్టిన సమయంలో ఏ నక్షత్రమండలం గుండా చంధ్రుడు సంచరిస్తున్నాడో అదే మీ జన్మనక్షత్రం .నక్షత్రలు మొత్తం 27. అశ్విని మొదటిది
.రేవతి చివరిది. ఈ నక్షత్రాన్ని బట్టి మీ జన్నరాశి జన్మదశ నిర్ణయించబడ్తుంది.


2.జన్మరాశి: మిరు పుట్టిన సమయంలో చందృడు సంచరించిన నక్షత్ర మండలం ఏ రాశికి సంభందించిందో అదే మీ జన్మరాశి. ఈ వివరాలు కూడ ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది.

3.జన్మలగ్నం:ప్రతి రోజు రవి తూర్పున  ఉదయించి పడమర అస్తమించి తిరిగి మరుసటి దినం తూర్పున ఉదయిస్తడు.
ఈ24 గంటల్లొ ప్రతి రేండు గంటలు (దాదాపుగా) ఒక రాశిని తేజోమయం చేస్తాడు మీరు పుట్టిన
సమయంలో రవి ఏ రాశిని తేజోమయం చేస్తున్నాడో అదే మీ జన్మలగ్నం.

4.జాతక చక్రం:ఈ చక్రం చతుర్బుజకారంలొ ఉంటుంది. ఇందులొ 12 గళ్ళు ఉంటాయి.మన సౌకర్యర్థం దీనిని చతుర్బుజాకారంలొ వేసుకుంటాం. అయితే ఈ చక్రం నిజానికి Land scape లోని ఓవల్ అకారంలొ ఉంటుంది. ఇందులొ 12 గళ్ళు 12 రాశులు (భావాలు)  ఉంటాయి. మొత్తం 360 డిగ్రిలు ప్రతి భాగం 30 డిగిరీలు ఉంటుంది.

గమనిక: జాతక ఫలాలు తేలూకోవడంలో లగ్నాన్ని ,గోచారఫలాలు తేలుసుకోవడం రాశిని స్టార్టింగ్ పాయింట్ గా తీసుకోవాలి గళ్ళు లేక్కించే సమయంలో క్లాక్ వైస్ అంటే ఏడవ వైపు నుండి కుడి వైపుగా లేక్కించాలి.

5.నవగ్రహలు:
రవి,చంద్ర,కుజ,గురు,శని,బుధ,శుక్ర 7 గ్రహలు మరియు రాహు కేతువులనే 2ఛాయా గ్రహలను కలిపి నవగ్రహలంటాం.

నవగ్రహాలు శుభత్వం- పాపత్వం;నవగ్రహాల శుభత్వ పాపత్వల నిర్ణయంలొ రేండు పద్దతులు
ఉన్నాయి. ఒకటి నైసర్గిక శుభత్వం,పాపత్వం మరొకటి లగ్నాత్ శుభత్వ పాపత్వం.

నైసర్గిక శుభత్వ పాపత్వం:
శుక్ల పక్ష చందృడు,గురు,పాపులతో కలవని బుధుడు,శుకృడు శుభులు తక్కిన వారు పావులు.

లగ్నత్ శుభత్వ పావత్వాలు:లగ్నం లేదా రాశి నుండి లేక్కించాలి ( దానితో కలిపి, క్లాక్ వైస్) అలా లేక్కించినప్పుడు 1,5,9- కొణ స్థానాలు. ఈ స్థానాధి పతులైన గ్రహలు శుభులు.
4,7,10- కేంద్ర స్థానాలు. ఈ స్థానాధి పతులైన గ్రుహాలు పావులు.
6,8,12- దుస్థానాలు ఈ స్థానాధిపతులు దుస్థానాధిపతులు( అత్యంత వినాశకారులు)
క్రింది బొమ్మలో రాశులు -వాటి అధిపతులను చూపడం జరిగింది.

(శశేషం)

మైనస్ 30 వయస్కులకు మాత్రమే

అనుభవ జ్యోతిష్యం పేరిట బ్లాగ్ ప్రారంభించానని చెప్పగానే ఈ బ్లాగును బుక్ మార్క్ చేసుకుని మరి విచ్చేసిన మీకు అన్ని శుభాలు కలుగనున్నాయి. కనీశం అశుభాలు తగ్గి పోనున్నాయి. ఇది మీకు నేను ఉత్తుత్తే ఇచ్చే తాయిలం కాదు సుమండి. అక్షరాల నిజం.

జ్యోతిష్యం మీద అస్సల్ నమ్మకం లేని వారు -నమ్మకం ఉన్నా ఏమాత్రం అవగాహణ లేని వారు -అవగాహణ కారణంగానే జ్యోతిష్కుల మీద నమ్మకం కోల్పోయిన వారు ఇలా అందరికీ ఎంతో కొంత మేలు చేకూరే విదంగా ఈ బ్లాగులో పోస్టులు వ్రాయాలనుకున్నా.

నా వయస్సు 46 కావడంతో - యువతను సైతం ఆకట్టుకోవాలనే కకృత్తి కొంత  ఎక్కువే కనబడుతుంటుంది. నన్నడిగితే ముప్పై ఏళ్ళకు పై పడ్డ వారు జాతకం చూపించుకోవడమే తప్పు. ఎందుకంటే ఒక వేళ వారు తమ జాతకానికి ఏమాత్రం సంభంధం లేని రంగంలో చిక్కుకు పోయి అష్ఠ కష్ఠాలు పడుతున్నా అందులోనుండి అంత తేలిగ్గా భయిట పడలేరు.

ఇదే యువకులైతే ప్రారంభంలోనే తమ రంగం ఏదో ముందుగా తెలుసుకొని అందుకు సంభంధించిన విధ్యను ఆర్జించి, విద్యకు సంభందించిన ఉధ్యోగం చూసుకొని ఏం చక్కా బతికెయ్యగలరు.

కోటి విద్యలు కూటు కోసమే ఎన్నాడెవడో ఒక వెధవ. అది అచ్చు తప్పు .కోటి విథ్యలు జన కోటి కోసమే.  చిల్లి గవ్వకు గతి లేక తిండికి టికానా లేక బతుకు బండి లాగిస్తున్న రోజుల్లో "మిని జ్యోతిష్య భోధిని" పేరిట ఒక చిన్నపుస్తకం వ్రాసి ప్రచురించాను.

చిత్తూరు పట్టణ వ్యాపారస్తుల సౌజణ్యంతో అది విడుదలైంది. దానిని చూసిన చిత్తూరు శ్రీ కృష్ణ జ్వెలర్స్ అధినేత జితేంద్ర బాబు జైన్ తమ స్పాన్సర్ షిప్లో ఐదువేల ప్రతులు ముద్రించి దినపత్రికల్లో పెట్టి మరి జన బాహుళ్యానికి అందుభాటులో తెచ్చారు.

ఈ నిష్కామ్య ఖర్మం మరి నా ప్రాక్టీస్ మెరుగు పడటానికి కూడ దోహదపడటం ఇప్పటికీ మరువలేను.  సతరు మిని జ్యోతిష్య భోధినిలోని విషయాలను మీకు ఒక మిని సీరియల్గా అందివ్వాలని దలచాను.

అయితే  నా కండిషన్ ఒకటే ఈ బ్లాగు చదివే ప్రతి ఒక్కరు దీనిని తమ మిత్ర భృందాలకు పరిచయం చెయ్యాలి. పాఠకుల సంఖ్య రోజుకి కనీశం వందైనా పెరగాలి.లేకుంటే వ్రాయడం మానేస్తా.

Saturday, January 25, 2014

అనుభవజోతిషం


ఈ పేరిట తెలుగులోను ఒక బ్లాగ్ ప్రారంభించాలని సంకల్పించాను.(ప్రారంభించేసాను)  ఫేస్ బుక్లో ఈ పేరిట ఒక పేజ్ ఓపెన్ చేస్తాను.(చేసేసాను). దానికి ఒక లైక్ కొట్టడానికి ఇక్కడ నొక్కండి

తమిళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన కంటెంట్స్ ఇక తెలుగు వారికి కూడ అందుభాటులో రానున్నాయి. ఇటీవల ప్రకటించి ఫిబ్రవరి 7 న విడుదల కానున్న 4 పుస్తకాల్లో జ్యోతిషం 360 పుస్తకాన్ని తిలి విడతగా తెలుగులో ముద్రించి -విడుదల చేయాలన్నదే అసలు ప్లాన్.

అయితే నా సిద్దాంతం ఒక్కటే. నదుల అనుసందానం మినహ మరి ఏ పనికైనా సరే నా డబ్బులు పెట్టుబడి పెట్టను.

కాబట్టి ముందస్తుగా సొమ్ము చెల్లించి మీ ప్రతిని బుక్ చేసుకోవలసి ఉంటుంది. క్రౌన్ సైజులో -80 పేజీలతో -మల్టి కలర్ రేపరుతో బుక్ వస్తుంది.

దీని వెల తమిళ పాఠకులకు రూ.125 గా నిర్ణయించి 126 మందికి పైగా బుక్ చేసుకున్నారు. కొరియర్ చార్జీలు అధనం.

ఇక్కడ కనీశం 100 మంది లైక్ కొట్టినా సరే - కమెంట్ వేసినా సరే నేను వెంటనే పని ప్రారంభిస్తాను.